అరసవిల్లి శ్రీ సాయి ఐఐటి కళాశాలలో బుధవారం అవగాహన సదస్సు జరిగింది. మత్తు పదార్థాలు వాటి దుష్ప్రభావాలు, ఉమెన్ ట్రాఫిక్కింగ్, కెరియర్ గైడెన్స్ పై అవగాహన కల్పించారు. ఇటీవలే జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన మురళి నాయక్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సెట్ శ్రీ సీఈవో బి ప్రసాద రావు, డిజైనబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.