తోటవాడలో కౌలు రైతులకు అవగాహన సదస్సు

66చూసినవారు
తోటవాడలో కౌలు రైతులకు అవగాహన సదస్సు
బూర్జ మండలం తోటవాడ గ్రామపంచాయతీలో గురువారం స్థానిక కౌలు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించినట్లు సర్పంచ్ సూర ఆనందరావు తెలిపారు. కూటమి ప్రభుత్వం భూ యజమానులతో పాటు కష్టపడి పని చేసి పంటను పండించే రైతులకు కూడా వివిధ సబ్సిడీల రూపంలో ఆదుకుంటుందని అవగాహన కల్పించారు. కౌలు రైతుల పేర్లు నమోదు చేసుకునేందుకు అవసరమయ్యే పత్రాలు వాటి ఉపయోగాలను వివరించారు. పి ప్రభాకర్ రావు, ప్రసాదరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్