శిలగాం సింగువలసలో కౌలు రైతులకు అవగాహన సదస్సు

61చూసినవారు
శిలగాం సింగువలసలో కౌలు రైతులకు అవగాహన సదస్సు
శ్రీకాకుళం రూరల్ మండలం సిలగాం సింగు వలస గ్రామంలో బుధవారం కౌలు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి ఎం. ఉషా కుమారి తెలిపారు. సర్పంచ్ కె. వసంతరావు, ఎంపీటీసీ సభ్యులు కె. జోగులు, దశరథ్ తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు అని తెలిపారు. సాగుభూమి గల యజమానితో పాటు కౌలు రైతులకు కూడా ప్రభుత్వం అన్ని రకాల పథకాలు వర్తింప చేస్తోందని ఏ ఈ ఓ ఎరుకునాయుడు, సిహెచ్ సి కన్వీనర్ రామదాసు అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్