బొబ్బిలిపేటలో స్టాప్ డయేరియా మలేరియా డెంగ్యూలపై అవగాహన

80చూసినవారు
బొబ్బిలిపేటలో స్టాప్ డయేరియా మలేరియా డెంగ్యూలపై అవగాహన
ఆముదాలవలస మండలం బొబ్బిలిపేట పంచాయతీ కార్యాలయం, పాఠశాల, అంగన్వాడి కేంద్రాలను గురువారం వెలుగు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఏపీఎం పైడి కూర్మారావు సందర్శించారు. స్టాప్ డయేరియా, మలేరియా, డెంగ్యూ తదితర కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రతతో సీజనల్ వ్యాధులు దరి చేరవని అన్నారు. అలాగే గ్రామంలో శానిటేషన్ పనులు పర్యవేక్షించారు. స్థానిక సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్