బూర్జ: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగంచేసుకోండి

65చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచే విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. గురువారం బూర్జ మండలం ఉప్పినివలస రైతు సేవ కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మిల్లర్లు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక అధికారులతో పాటు రైతులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్