ఆముదాలవలస వెంకటేశ్వర స్వామి ఆలయ ఈవోగా పనిచేసిన తమ్మినేని రవి ను ఆముదాలవలస మున్సిపల్ కమిషనర్ గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆముదాలవలస గ్రూప్ దేవాలయాల అడిషనల్ చార్జ్ ఈవోగా సిహెచ్ ప్రభాకర్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం సిహెచ్ ప్రభాకర్ మoదస దేవాదాయ శాఖ ఈవో గా పని చేస్తున్నారు.