శ్రీకాకుళం జిల్లా పోలీసు సూపరిండెంట్ మహేశ్వర్ రెడ్డి దబ్బ గూడా గ్రామంలో పరిశీలించారు. దబ్బగూడ గ్రామంలో నిన్న రాత్రి ఓ క్వారీలో జరిగిన ప్రమాద సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పి శ్రీ కె. వి మహేశ్వర రెడ్డి ఐపీఎస్ శనివారం సందర్శించి ఘటనకు గల కారణాలు ఆరా తీసి వివరాలు సేకరించారు. ఘటనకు గల కారణాలపై పూర్తిస్థాయిలో సమగ్రంగా దర్యాప్తు చేపట్టాలని పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ దిశానిర్దేశాలు చేశారు.