ఆముదాలవలస మండలం సైలాడ పంచాయతీ దివoజీపేట గ్రామానికి వెళ్లే రహదారిలో ప్రయాణం కష్టతరంగా మారిందని వాహనదారులు తెలిపారు. మంగళవారం ఉదయం భారీ వర్షంతో రోడ్డుపై ఉన్న గోతుల్లో నీరు నిలిచిందని తెలిపారు. ప్రమాదాలు జరగకముందే సంబంధిత ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.