ఆముదాలవలస పట్టణంలో గల శ్రీ పాలపోలమ్మవారి దేవాలయంలో ఈనెల మూడో తేదీ గురువారం నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు మొదలవలస రమేష్, పి. రమణ, గురునాథ్, అప్పలనాయుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం కమిటీ సభ్యుల తో అమ్మవారి దేవస్థానం వద్ద సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. పూజా కార్యక్రమాలు భక్తులకు, భక్తుల సౌకర్యార్థం తీసుకోవలసిన అనేక జాగ్రత్తగా గురించి చర్చించినట్లు తెలిపారు.