మండల పరిషత్ కార్యాలయంలో విద్యార్థులకు చెకుముకి టాలెంట్ టెస్ట్

58చూసినవారు
మండల పరిషత్ కార్యాలయంలో విద్యార్థులకు చెకుముకి టాలెంట్ టెస్ట్
ఆముదాలవలస మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ ను మంగళవారం నిర్వహించినట్లు జన విజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు బి. జనార్దన్ రావు తెలిపారు. మొత్తం 17 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో దూసిపేట, అక్కులపేట, కోర్లకోట జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు మండల స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచారని అన్నారు.

సంబంధిత పోస్ట్