బూర్జ మండలం చీడివలస ఎంపీయుపి స్కూల్, గంగమ్మపేట ఎంపీపీ స్కూల్, ఎంపీడీవో కార్యాలయo వద్ద గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఎగురవేసి దేశ స్వతంత్రానికి గౌరవ వందనం చేశారు. స్వతంత్ర సాధనలో శాంతియుత పోరాట యోధులు, బ్రిటిష్ వారిని ఎదిరించడంలో విప్లవ వీరుల త్యాగాలు మరువలేనివని పలువురు వక్తలు కొనియాడారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు.