సరుబుజ్జిలి పోలీస్ స్టేషన్ ఎస్ఐగా బి. హైమావతి విధుల్లో చేరారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ నుంచి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంతవరకు ఇక్కడ పనిచేసిన ఎస్సై ఎస్. బాలరాజు ఆమదాలవలస పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. సోంపేట ఎస్ఐగా పనిచేస్తున్న హైమావతి బదిలీపై సరుబుజ్జిలి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఎస్ఐ హైమావతికి స్టేషన్ సిబ్బంది సాదరంగా ఆహ్వానం పలికి అభినందనలు తెలిపారు.