మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కంచిలి జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం సీతారాం నాయుడు అభిప్రాయపడ్డారు. తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు శుక్రవారం పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న పలువురు మహిళా ఉపాధ్యాయురాళ్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.