కోటబొమ్మాళి మండలంలోని ఎత్తురాళ్లపాడు జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒడిశాకు చెందిన ముగ్గురు వ్యక్తులు బొలెరో వాహనంలో సింహాచలం దేవస్థానానికి వెళ్తుండగా వాహనాన్ని పక్కకు ఆపిన సమయంలో వెనుక నుంచి వచ్చిన మరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.