వెదుళ్ళవలసలో మహాలక్ష్మి పేరంటాల వార్షికోత్సవ వేడుకలు

75చూసినవారు
వెదుళ్ళవలసలో మహాలక్ష్మి పేరంటాల వార్షికోత్సవ వేడుకలు
ఆముదాలవలస మండలం వెదుళ్ళ వలస గ్రామంలో గురువారం మహాలక్ష్మి తల్లి పేరంటాలు 64 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో హిందు భక్తులందరూ సాంప్రదాయానికి అనుగుణంగా వస్త్రధారణ చేసి పూజల నిర్వహించారు. మహాలక్ష్మి తల్లికి వివిధ పూజ ద్రవ్యాలు సమర్పించి మొక్కలు చెల్లించారు. సోదర ప్రాంతాలలో వృత్తిరీత్యా ఉన్నవారు కూడా ఈ పూజలో పాల్గొనేందుకు రావడంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్