ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ఏర్పడిన ప్రజా దర్బార్ కార్యక్రమం ఆముదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూన రవికుమార్ కు నియోజకవర్గంలోని ప్రజలు సమస్యలను అర్జీల రూపంలో విన్నవించారు. తక్షణమే సమస్య పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు.