పొందూరు మండల కేంద్రంలో కాటి చెరువు కాలనీ నుంచి పెద్ద చెరువు వరకు రూ. 90 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ గురువారం పరిశీలించారు. మేజర్ పంచాయతీలో ప్రతీ వీధిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా చేపట్టడం జరిగిందన్నారు. రహదారుల నిర్మాణంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ పాల్గొన్నారు.