ఎమ్మెల్యే కూన రవికుమార్ కు పెన్షనర్లు ఆత్మీయ సత్కారం

70చూసినవారు
ఎమ్మెల్యే కూన రవికుమార్ కు పెన్షనర్లు ఆత్మీయ సత్కారం
ఆముదాలవలస నియోజకవర్గం కూటమి టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తో గురువారం ఆముదాలవలస రిటైర్డ్ పెన్షనర్ల సంఘం సభ్యులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గౌరవ సత్కారం చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో పాల్గొని గత ఐదేళ్ల గా పెన్షనర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. సంఘం సభ్యులు సిమ్మి నాయుడు, జనార్దన్ రావు, హెచ్ వి సత్యనారాయణ, మోహన్ రావు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్