మున్సిపల్ కార్యాలయంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే కూన రవి

ఆమదాలవలస మున్సిపాలిటీ ఆఫీస్ వద్ద స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి ప్రతిజ్ఞ నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్య సమస్యలు దరి చేరవని అన్నారు. స్వచ్ఛమైన గాలి, చల్లదనం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలని సూచించారు.