ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆముదాలవలస నియోజకవర్గంలో దన్నానపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో శుక్రవారం జాబ్ మేళా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కూన రవికుమార్ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కోసం పలు సలహాలు, సూచనలు అందించారు.