రాష్ట్ర యువత పర్తియాత్రలో భాగంగా జాతీయ నారాయణ సేవ కార్యక్రమాన్ని సాయి శ్రుతి మందిరం.. మెట్టెక్కివలస, ఆమదాలవలసలో కన్వీనర్ కామవధానులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని యూత్ కో ఆర్డినేటర్ దామోదర్ పట్నాయక్, బాల వికాస్ విద్యార్థులు ఘనంగా నిర్వహించి.. 71 మంది నారాయణలకు భోజనం, పండ్లు అందించారు. ఎం. రవీంద్ర, పి. తాతయ్య, ఎస్.జి రమణ, ఎ.రామకృష్ణ, వెంకటరమణమూర్తి, జగన్నాధ రావు, ఎస్.తమ్మయ్య పాల్గొన్నారు.