సమస్యలు పరిష్కారంలో అధికారులు చొరవ చూపాలి

64చూసినవారు
సమస్యలు పరిష్కారంలో అధికారులు చొరవ చూపాలి
మున్సిపాలిటీలో సమస్యలపై అధికారులు చొరవ చూపాలని మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు కోరారు. ఇఛ్ఛాపురంలో శనివారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. త్రాగు నీరు సరఫరా చేయుటకు తాత్కాలిక డ్రైవర్లు , కొళాయి కనెక్షన్, కొళాయి లేని ఇల్లకు పన్ను తొలగించాలని , కాలువాలలో బురద తొలగించాలని, త్రాగునీరు ట్యాక్టర్లు సక్రమంగా ఉపయోగించాలని తదితర అంశాలపై చేర్చించారు. 11 వ వార్డు కౌన్సిలర్ ఆశి. లీలారాణి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్