ఆమదాలవలస మండలం ఊసావానిపేటలో కొలువై ఉన్న శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశేష పూజలు జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు మావుడూరి శ్రీనివాస్ శర్మ, సత్య నారాయణ శర్మ, సూర్య ప్రకాష్ శర్మ ఆధ్వర్యంలో అష్టోత్తర శతనామావళితో స్వామి వారికి వేకువజాము నుంచి అభిషేకాలు నిర్వహించారు. కసివమ్మతల్లి భజన మండలి భజన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.