పొందూరు మండలంలోని వావిలపల్లిపేట వద్ద గల ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతిలో ప్రవేశానికి ఈనెల 21న ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ హెచ్. ప్రభాకర్ శుక్రవారం తెలిపారు. ముందుగా ఈనెల 20న ప్రవేశ పరీక్షను అధికారులు ప్రకటించగా ఆరోజు ఈస్టర్ సందర్భంగా ప్రవేశ పరీక్ష తేదీని మార్చడం జరిగిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలన్నారు.