పోలాకి: గడ్డి మందు తాగి బలవన్మరణం

5చూసినవారు
పోలాకి: గడ్డి మందు తాగి బలవన్మరణం
పోలాకి మండలం పిన్నింటిపేటకు చెందిన కరుకోల కూర్మారావు(43) వెల్డింగ్‌ దుకాణం నిర్వహించేవారు. మద్యం అలవాటుతో అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురై ఈ నెల 2న గడ్డి మందు తాగారు. చికిత్స కోసం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించగా గురువారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందారు. శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్