ఆమదాలవలస టీడీపీ కార్యాలయంలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్థానిక కార్యాలయం నుంచి ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ ఈ కార్యక్రమంలో హాజరవుతారని, ప్రజల నుంచి వినతుల స్వీకరిస్తారని తెలిపారు. కావున నియోజకవర్గం ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.