ఆమదాలవలస మండలంలో వర్షం

59చూసినవారు
ఆమదాలవలస మండలంలో వర్షం
ఆమదాలవలస మండలంలోని తురకపేట, వెదుళ్ళవలస, చీమలవలస, నెల్లిపర్తి గ్రామాల్లో బుధవారం ఉదయం నుంచి ముసురు వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు కూడా కురిశాయి. ఇలాంటి వాతావరణం పొలాల్లో గట్లు చదును చేసేందుకు అనుకూలంగా ఉందని రైతులు పేర్కొన్నారు. కాగా గత కొద్ది రోజులు తీవ్ర ఎండలతో ఇబ్బంది పడ్డ ప్రజలు ఈ వర్షంతో ఉపశమనం పొదారు.

సంబంధిత పోస్ట్