బూర్జ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి పనుల గుర్తింపు, నిర్వహణ, చెల్లింపులు తదితర అంశాలపై శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం ఉద్దేశ్యo, ప్రాముఖ్యతను వివరిస్తూ గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎన్ఆర్ఈజీఎస్ సామాజిక తనిఖీ అధికారులు, ఎంపీడీవో, సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, సచివాలయ సిబ్బంది, వేతనదారులు పాల్గొన్నారు.