ఆముదాలవలస మండలం వెదుల్లవలస గ్రామం లోని ఎం పి పి స్కుల్ లో గురువారం డాక్టర్ సర్వేపల్లి రాధకృష్ట జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా ఉపాధ్యాయులు రమణ మాస్టారు పాల్గొన్నారు. ఆయనకి శాలువా కప్పి ఘన సత్కారం చేశారు. ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులను, గురువులను గౌరవించినప్పుడే సమాజం బాగుపడుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, యువత పాల్గొన్నారు.