పొందూరు మండలం చిన్న బొడ్డేపల్లి రైల్వే అండర్ పాసేజ్ లో నీరు నిలిచిపోవడంతో గురువారం వాహనదారులకు, పాదచరులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి మరింతగా నీరు ఎక్కువైందని స్థానికులు తెలిపారు. మోటార్ల సహాయంతో నీటిని తొలగించే విధంగా రైల్వే అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.