ఎన్టీఆర్ భరోసా పింఛన్లను సద్వినియోగం చేసుకోండి

61చూసినవారు
ఎన్టీఆర్ భరోసా పింఛన్లను సద్వినియోగం చేసుకోండి
ఉమ్మడి కూటమి ప్రభుత్వం అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆమదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్ తెలిపారు. మంగళవారం పొందూరు మండలం కేశవ దాసుపురం పంచాయతీలో ఆయన లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పింఛన్ల మొత్తాన్ని ఒకేసారి పెంచిందని దీనిని ప్రజలు గుర్తించాలని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్