శ్రీకాకుళం సాక్షి కార్యాలయం ముందు సోమవారం తెలుగు యువత, తెలుగు మహిళా వింగ్స్ ఆధ్వర్యంలో సోమవారం కూటమి నేతలు ఆందోళన చేశారు. అమరావతి రాజధానిపై, మహిళలపై జర్నలిస్టు ముసుగులో సాక్షి జర్నలిస్టులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. జిల్లా తెలుగు మహిళా అధ్యక్షులు తమ్మినేని సుజాత, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండదాసు నాయుడు ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది.