గాంధీజీ నాటిన మొక్క.... నేడు మహా వృక్షం

65చూసినవారు
గాంధీజీ నాటిన మొక్క.... నేడు మహా వృక్షం
ఆమదాలవలస మండలం దూసి రైల్వే స్టేషన్ లో 1942లో గాంధీజీ మర్రి మొక్కను నాటారు. అయితే నేడు మహా వృక్షంగా మారింది. ఈ వృక్షానికి 82 ఏళ్లు అయ్యిందని దూసి గ్రామస్థులు తెలిపారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఉద్యమకారుల్లో చైతన్యo చేసుందుకు దూసి రైల్వేస్టేషన్ కు గాంధీజీ చేరుకున్నారు. అక్కడ స్వాతంత్య్ర కాంక్ష పై మాట్లాడి, మర్రి మొక్క ను నాటారు. ఆ వృక్షాన్ని చూస్తే గాంధీజీనే గుర్తుకు వస్తారని ప్రజలు తెలిపారు.

సంబంధిత పోస్ట్