జాతిపిత మహాత్మాగాంధీ స్వతంత్ర ఉద్యమంలో చేసిన త్యాగం మరువలేనిదని ఆముదాలవలస నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు సనపల అన్నాజీరావు అన్నారు. బుధవారం గాంధీజయంతి సందర్భంగా పట్టణంలోని వన్వే జంక్షన్లో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వతంత్ర ఉద్యమం కోసం మహాత్మా గాంధీ చేసిన పోరాటం ఆదర్శప్రాయమని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.