ఆముదాలవలస మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం నుంచి కృష్ణాపురం జంక్షన్ వరకు ఈనెల 18వ తేదీ ఆదివారం సాయంత్రం 4గంటలకు తిరంగా యాత్ర నిర్వహిస్తున్నట్లు ఆముదాలవలస ఎమ్మెల్యే కార్యాలయం నుంచి శుక్రవారం ఒక ప్రకటన విడుదలైంది. ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ ఛైర్మన్ కూన రవికుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌లో అమరులైన సైనికుల ధైర్య సాహసాలకు జోహార్లు పలుకుతూ అందరూ పాల్గొనాలని కోరారు.