అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్

50చూసినవారు
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్
ఆమదాలవలస మండలం పరిధి నాగావళి నది పర్యవాహక ప్రాంతం దూసి ఇసుక రేవు నుండి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 7 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకొని సీజ్ చేసినట్టు ఎస్సై కె. వెంకటేష్ తెలిపారు. ఆదివారం రాత్రి దూసి గ్రామం వద్ద ఇసుకను తరలించేందుకు కొంతమంది సిద్ధమయ్యారన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఏడు ట్రాక్టర్లు ఇసుకను తరలిస్తున్నట్టు గుర్తించారు.

సంబంధిత పోస్ట్