విద్యుత్ పోల్స్ కి పలుచోట్ల పిచ్చి మొక్కలు అల్లుకొని చుట్టుకుంటున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని వాదనలు బలంగా వినబడుతున్నాయి. ఆముదాలవలస గేటులో స్టేట్ బ్యాంక్ కొర్లకోట బ్రాంచ్ పరిసరాల్లో కళింగ నగర్ లో ఎలక్ట్రికల్ పోల్ కి పిచ్చి మొక్కలు అల్లుకున్న సంబంధిత సిబ్బంది తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని వాదనలు బలంగా వినబడుతున్నాయి. అధికారులు దృష్టి సారించి వాటిని తొలగించాలని కోరుతున్నారు.