ఆమదాలవలస మండలం వెదుళ్ల వలస గ్రామంలోని రామాలయంలో వైకుంఠ ఏకాదశి సందడి నెలకొంది. శుక్రవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా మేలుకొలుపు బృందం, భక్తులు ఉదయం నాలుగు గంటల నుంచి స్వామివారి నామాలతో తిరువీధులు తిరుగుతూ స్వామివారిని మేలుకొలిపారు. వైకుంఠ ఏకాదశి కావడంతో గ్రామస్తులు భక్తులకు ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించారు. అనంతరం స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో పల్లకిలో తిరు వీధులు ఊరేగించారు. .