స్వర్గీయ వండాన తవిటి నాయుడు జ్ఞాపకార్థం గత ఏడాది పాఠశాల 10వ తరగతిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థిని మట్ట శైలజకు మాజీ వైస్ ఎంపీపీ వండాన ఉదయ్ కుమార్ సైకిల్ బహుకరించారు. గురువారం ఆముదాలవలస మండలంలోని నిమ్మతొర్లాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం వేడుకలు సందర్భంగా విద్యార్థినికి సైకిల్ అందజేశారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎం తులసి బాయ్, ఎస్ఎంసి చైర్మన్ సీతమ్మ,తదితరులు పాల్గొన్నారు.