కార్మికుల సమస్యల పరిష్కారానికి ముందడుగు వేయాలి

53చూసినవారు
కార్మికుల సమస్యల పరిష్కారానికి ముందడుగు వేయాలి
కార్మికులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందడుగు వేయాలని అఖిల భారత డిమాండ్స్ డే సందర్భంగా సిఐటియు నాయకులు బుధవారం గార మండలం ఎమ్మార్వో శ్రీనివాసరావుకు వినతిపత్రం అందించారు. ప్రభుత్వ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ప్రతినెల చెల్లించాలని డిమాండ్ చేశారు. అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్