ఆముదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం యోగా దినోత్సవం నిర్వహించారు. ఆమదాలవలస మున్సిపల్ కమిషనర్ పూజారి బాలాజీ ప్రసాద్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయ ఉద్యోగులు సిబ్బంది కళాశాల విద్యార్థులు యోగాoద్రా ర్యాలీ నిర్వహించారు. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని నినాదాలు చేశారు. ప్రతినిత్యం యోగా సాధన చేయాలని సూచించారు.