లావేరు గ్రంథాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

52చూసినవారు
లావేరు గ్రంథాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
లావేరు శాఖా గ్రంధాలయములో సోమవారం డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలిత ఆయన చిత్రపటానికి గ్రంథాలయాధికారి మురపాక శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించిన సమతా వైతాళికుడు భారతరత్న డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి విద్యార్థి ఆదర్శవంతంగా తీసుకోవాలన్నారు. ఈయన జీవిత చరిత్రపై నిర్వహించిన వ్యాసరచన పోటీలో విజేతలకు బహుమతులను అందజేశారు.

సంబంధిత పోస్ట్