కార్మిక హక్కులు కాలరాసే లేబర్ కోడ్ లు రద్దు చేయాలని, కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని మే 20న అఖిల భారత సమ్మె జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సి. హెచ్. అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. బుధవారం రణస్థలంలో సిఐటియు మండల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో కనీస వేతనం నెలకు రూ. 26వేలు నిర్ణయించి అమలు చేయాలన్నారు.