బీజేపీ కూటమి రాజ్యాంగానికి తూట్లుపొడిచి మనువాదాన్ని అమలుచేయాలని చేస్తున్న ప్రయత్నంను ఐక్యంగా తిప్పికొట్టాలని సీఐటీయు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. డా. బి. ఆర్. అంబేద్కర్ 134వ జయంతి సందర్బంగా సోమవారం రణస్థలం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ లౌకిక రాజ్యాంగ పరిరక్షణే డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్‌కు నివాళి అని అన్నారు.