రణస్థలం మండల పరిషత్ కార్యాలయంలో జ్యోతి రావు పూలే జయంతి వేడుకల్లో శుక్రవారం ఎచ్చెర్ల నియోజకవర్గ వైసీపీ నాయకులు పిన్నింటి సాయికుమార్ పాల్గొని ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పూలే బడుగు బలహీన వర్గాల ప్రజలు సమాజంలో గౌరవంగా బతికేందుకు పునాదులు వేశారన్నారు. వారి కృషి ఫలితమే ఈ నాటి సామాజిక విప్లవమన్నారు.