ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలో సారిపల్లి జనార్ధన్ అనే ఆటో డ్రైవర్ పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్యానికి బానిసై అలాగే ఆరోగ్య సమస్యలతో సతమతమవుతు మంగళవారం ఇంట్లో లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు బాధితుడిని శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.