రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన విద్యార్థులకు ఎచ్చెర్ల నియోజకవర్గం శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు అభినందనలు తెలియజేశారు. మంగళవారం ఎచ్చెర్ల నియోజకవర్గం అల్లినగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్ సంబరాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ఎంపికైన విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో స్థానిక ఉపాధ్యాయులు పాల్గొన్నారు.