ఎచ్చెర్ల మండలం దుప్పలవలస గ్రామానికి చెందిన ఇమంది అనిత ఫిర్యాదు మేరకు ఎచ్చెర్ల పోలీసులు మంగళవారం నలుగురిపై గృహ హింస కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. దుప్పలవలసకు చెందిన అనితకు 2019లో ముద్దాడకు చెందిన వంకా ముత్యాలరావుతో వివాహం అయింది. వీరికి ఒక కుమార్తె ఉంది. ముత్యాలరావు క్రికెట్ బెట్టింగ్లో రూ. 4లక్షలు పోగొట్టుకొని అనితను డబ్బులు తీసుకు రావాలని వేధించేవాడు.