డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు అన్నారు. ఈ మేరకు అంబేద్కర్ 135వ జయంతి సందర్బంగా సోమవారం ఎచ్చెర్లలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు ఘనంగా నివాళిర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు పాల్గొన్నారు.