ఎచ్చెర్ల: కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో 275 మంది ఎంపిక

64చూసినవారు
ఎచ్చెర్ల: కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో 275 మంది ఎంపిక
ఎచ్చెర్లలోని ఆర్మ్డ్ రిజర్వు పోలీసు మైదానంలో శుక్రవారం జరిగిన పోలీసు కానిస్టేబుల్ శారీరిక దేహదారుఢ్య పరీక్షలకు 662 అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 400మంది అభ్యర్థులు హాజరైనట్లు జిల్లా ఎస్పీ కె. వి. మహేశ్వర రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వీరిలో ఛాతీ కొలత, ఎత్తు, 1600, 100 పరుగు, లాంగ్ జంపు ఈవెంట్లలో 275 మంది అభ్యర్థులు క్వాలిఫైడ్ అయ్యారన్నారు.

సంబంధిత పోస్ట్